సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం.గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత ముఖ్య పాత్రల్ని పోషించారు. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
‘మాది బెంగళూరు. నాకు సినిమాల మీద ఉన్న ప్యాషన్, ఇష్టం తెలుసుకుని నా ఫ్రెండ్స్ ద్వారా దర్శకుడు చిన్మయ్ రామ్ పరిచయం అయ్యారు. ఆయన చెప్పిన ఈ ‘జిన్’ కథ నాకు చాలా నచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా అని నిర్మించేందుకు ముందుకు వచ్చాను.
ఈ చిత్రాన్ని కర్ణాటక, ఆంధ్రా బార్డర్‌లో షూట్ చేశాం. ఇప్పటికే నేను సినిమాను చూశాను. కథ విన్నప్పుడు నేను ఏమైతే ఫీల్ అయ్యానో, ఊహించుకున్నానో తెరపైనా అదే ఫీలింగ్ కలిగింది. అందరినీ భయపెట్టేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీకి అలెక్స్ ఇచ్చిన ఆర్‌ఆర్, సునీల్ హొన్నలి విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. చిన్మయ్ రామ్ గొప్పగా తెరపైకి తీసుకువచ్చారు. ఈ చిత్రం అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది. మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మామూలుగా ఈ జిన్ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. మేం ఈ మూవీలో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. అది తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తుంది’ అని నిఖిల్ ఎం గౌడ తెలిపారు.
అందర్నీ భయపెట్టే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



