శుభ్‌మన్ గిల్ ఔట్.. సంజు ఇన్..
ఐదు టి20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యతలో టీమిండియా
19న అహ్మదాబాద్‌లో ఐదో, చివరి టి20
లక్నో: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాల్గో టి20కి అధిక పొగమంచు కారణంగా రద్దయ్యింది. బుధవారం రాత్రి 7.00గం||ల నుంచి రాత్రి 9.30గం||ల వరకు పొగమంచు తగ్గితే మ్యాచ్‌ను నిర్వహించాలని చూసిన అంపైర్లకు పొగమంచు తగ్గకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో రాత్రి 9.30గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశతో గ్యాలరీలను వీడారు. అధిక పొగమంచు కారణంగా కనీసం టాస్ వేసే అవకాశం కూడా దక్కలేదు.
దీంతో లక్నోలోని ఏక్‌నా స్టేడియంలో జరిగే నాల్గో టి20లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆశించిన టీమిండియాకు ఇది నిరాశగా మిగిలింది. ఐదు టి20ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే. నాల్గో టి20కి ముందు భారతజట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాదం గాయం కారణంగా ఈ టి20కి మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతడు మిగిలిన రెండు మ్యాచ్‌లకు బరిలోకి దిగడం కష్టమే. దీంతో అతడి స్థానంలో తుదిజట్టులోకి సంజు శాంసన్ వచ్చి చేరాడు. ఇక అనారోగ్యంతో చివరి రెండు టి20లకు దూరమైన అక్షర్ పటేల్ స్థానంలో బిసిసిఐ షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.



