ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు, ట్రంప్ సన్నిహితుడు
ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లకు పెరిగిన సంపద
కొత్త స్టార్టప్ ఎక్స్‌ఎఐ విలువ సుమారు 230 బిలియన్లు
వాషింగ్టన్ : ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు, ట్రంప్ సన్నిహితుడు ఎలన్ మస్క సంపద ఇటీవల భారీగా పెరుగుతోంది. మంగళవారం నాటికి ఆయన నికర సంపద 677 బిలియన్ డాలర్లకు చేరి ట్రిలియన్ డాలర్ల వైపు దూసుకుపోతోంది. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కేవలం నాలుగు నెలల క్రితం ఆగస్టులో ఉన్న విలువ కంటే రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్లకు చేరింది. మస్క్ సంపద ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లకు పెరిగింది. స్పేస్‌ఎక్స్‌లో ఆయన వాటా 42 శాతంతో 168 బిలియన్లుగా ఉంది. టెస్లాలో 12 శాతం వాటాతో 197 బిలియన్లకు చేరింది. మస్క్ కొత్త స్టార్టప్ ఎక్స్‌ఎఐ విలువ సుమారు 230 బిలియన్లకు పెరిగింది. ఇందులో మస్క్‌కు 53 శాతం. వాటా ఉంది. ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడైన గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ 252 బిలియన్ల సంపద కంటే ఎలన్ మస్క్ 425 బిలియన్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. ముఖేష్ అంబానీ సంపద ప్రస్తుతం 111.4 బిలియన్లుగా ఉంది.
ట్రిలియన్ డాలర్ల దిశగా ఎలన్ మస్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



