ఇథియోపియా పార్లమెంటులో మోడీ ప్రసంగం
ఆడిస్ ఆబబ : ప్రాంతీయ శాంతి, భద్రత, అనుసంధానంలో భారత్, ఇథియోపియా సహజ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇథియోపియాలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లుందని తెలిపారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటులో బుధవారం మోడీ ప్రసంగించారు. ప్రాచీన జ్ఞానం, ఆధునిక ఆశయాలు కలిగిన ఈ దేశ ప్రజాస్వామ్య మందిరంలో ఉండటం గర్వకారణమని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, ఇథియోపియా ఒకదానికొకటి పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
”ఇథియోపియా, గుజరాత్ రెండు కూడా సింహాలకు ప్రసిద్ధి. ఈ దేశంతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రపంచమంతా వసుదైౖక కుటుంబమైంది. భారతీయ టీచర్లు చాలా మంది ఇథియోపియాలో సేవలు అందిస్తున్నారు. ఇక్కడ అత్యధిక విదేశీ పెట్టుబడిదారులుగా భారతీయులే ఉన్నారు. వీరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నారు” అని మోడీ తెలిపారు.
ఇథియోపియా పార్లమెంట్, ప్రజలు, ప్రజాస్వామ్య ప్రయాణం పట్ల తనకు లోతైన గౌరవం ఉందని ప్రధానమంత్రి అన్నారు. 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకొచ్చానని, ఇథియోపియా పార్లమెంట్, ప్రజలు, వారి ప్రజాస్వామ్య ప్రయాణానికి తాను గాఢమైన గౌరవం వ్యక్తం చేస్తున్నానని ప్రధాని తెలిపారు. ”ఈ భవనంలో ప్రజల సంకల్పమే రాష్ట్ర సంకల్పంగా మారుతుంది. ప్రజల చక్రం, రాష్ట్ర చక్రం సమన్వయంతో కదిలితే, అభివృద్ధి చక్రం ముందుకు సాగుతుంది” అని పేర్కొన్నారు. ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం అందించినందుకు ప్రధాని అబిరు అహ్మద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని భారత ప్రజల తరఫున నమ్రతతో స్వీకరిస్తున్నానని అన్నారు. ఇథియోపియా ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటని మోడీ కొనియాడారు. ఈ దేశ చరిత్ర పర్వతాల్లో, లోయల్లోనే కాక ప్రజల హృదయాల్లో కూడా జీవిస్తోందని చెప్పారు. భారత్-ఇథియోపియా మధ్య సాంస్కృతిక అను బంధాన్ని ప్రస్తావిస్తూ, భారత జాతీయ గీతం వందేమాతరంలోనూ, ఇథియో పియా జాతీయ గీతంలోనూ భూమిని తల్లిగా పేర్కొనడం విశేషమని తెలిపారు.
ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



