Thursday, December 18, 2025
E-PAPER
Homeబీజినెస్ఫెడరేషన్‌ యూనివర్సిటీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ ల్యాబ్‌

ఫెడరేషన్‌ యూనివర్సిటీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ ల్యాబ్‌

- Advertisement -

హైదరాబాద్‌లోని రాక్‌వెల్‌ బిజినెస్‌ స్కూల్‌తో ఎక్స్‌ప్రో ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్‌
ఫెడరేషన్‌ యూనివర్సిటీ ఆస్ట్రేలియా అనుబంధ సంస్థ Employability.life ఈ నెల 14న జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ ల్యాబ్‌ను విజయవంతంగా ప్రారంభించింది, దాని వర్క్‌-సిమ్యులేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం ఎక్స్‌ప్రోను హైదరాబాద్‌లోని రాక్‌వెల్‌ బిజినెస్‌ స్కూల్‌తో కలిసి ప్రారంభించింది. ఈ అప్లికేషన్‌ కెరీర్‌కు కీలక మలుపు కానుంది. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగ సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు వీలు కల్పించనుంది. ఈ ప్రారంభోత్సవంలో ఫెడరేషన్‌ యూనివర్సిటీ ఆస్ట్రేలియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ పాల్‌ ఓపెన్‌హైమర్‌ మాట్లాడుతూ ఎక్స్‌ప్రో ప్రోగ్రామ్‌ విద్యార్థులను రేపటి శ్రామికశక్తికి సిద్ధమవ్వడంలో శక్తివంతమైన మార్పును సూచిస్తుందని తెలిపారు. ప్రపంచ పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటూ, అంతర్జాతీయంగా కెరీర్‌ను మలుచుకునేందుకు సిద్ధం చేస్తుందని వెల్లడించారు.

ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం వెనుక ఉన్న దృష్టిని హైలైట్‌ చేస్తూ, Employability.life సీఈఓ రాజా దాస్‌గుప్తా మాట్లాడుతూ ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ ల్యాబ్‌లో నిర్వహించ నున్న ఎక్స్‌ప్రోతో, పరిశ్రమ నుంచి ప్రేరణ పొందిన ప్రత్యక్ష సవాళ్ల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడానికి వీలు కల్పిస్తున్నామన్నారు. రాక్‌వెల్‌ బిజినెస్‌ స్కూల్‌తో మా భాగస్వామ్యం విద్యార్థులకు లోతైన విద్యా నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు స్పష్టం చేశారు. తద్వారా రాక్‌వెల్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు అధ్యయనంలో లీనమవుతూ, పరిశ్రమ-రూపకల్పన నుంచి ఎదురయ్యే సవాళ్లు, పని విధానం, ప్రొఫెషనల్‌ మెంటరింగ్‌ నుంచి ప్రయోజనం పొందుతారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కెరీర్‌ నిర్మించుకునేందుకు సంసిద్ధతతో పట్ట భద్రులవుతారని తెలిపారు. రాక్‌వెల్‌ బిజినెస్‌ స్కూల్‌ నాయకత్వం విద్యా-పరిశ్రమ సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విద్యార్థులను డైనమిక్‌ కెరీర్‌ మార్గాలకు సిద్ధం చేయడానికి వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ యూనివర్సిటీ ఆస్ట్రేలియా, Employability.life సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలు, రాక్‌వెల్‌ బిజినెస్‌ స్కూల్‌ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -