Thursday, December 18, 2025
E-PAPER
Homeబీజినెస్అమెజాన్‌ పేలో ఫేస్‌ స్కాన్‌తోనూ చెల్లింపులు

అమెజాన్‌ పేలో ఫేస్‌ స్కాన్‌తోనూ చెల్లింపులు

- Advertisement -

న్యూఢిల్లీ : యూపీఐ చెల్లింపులకు ఇక ప్రతీసారి పిన్‌ నెంబర్‌ను నమోదు చేయావల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అమెజాన్‌ పే తెలిపింది. ఫేస్‌ స్కాన్‌ లేదా ఫింగర్‌ ప్రింట్‌ను ఉపయోగించి వినియోగదారులు లావాదేవీలను జరపవచ్చని పేర్కొంది. రూ.5,000 వరకు లావాదేవీల కోసం బయోమెట్రిక్‌ను ఉపయోగించుకోవచ్చని అమెజాన్‌ ఇండియా పేమెంట్స్‌ డైరెక్టర్‌ గిరీష్‌ కృష్ణన్‌ వెల్లడించారు. డిజిటల్‌ చెల్లింపులు ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా, సురక్షితంగా చేయడమే తమ లక్ష్యమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -