బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజరు కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 30న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలతో తన బర్త్‌డే సందర్భంగా కథానాయకుడు మంచు మనోజ్ సోమవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఒక సినిమా ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిశారు. డైరెక్టర్ విజరు నన్ను కలవాలని అనుకుంటున్నారని చెప్పారు. విజరు నన్ను కలిసి ఈ కథ గురించి చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఇది చాలా మంచి యాక్షన్ డ్రామా.
ఈ సినిమాలో గజపతివర్మగా కనిపిస్తాను. ఇలాంటి క్యారెక్టర్‌ని ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్. ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఇందులో నాతోపాటు సాయిశ్రీనివాస్, నారా రోహిత్ ఇలా.. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరి స్క్రీన్ స్పేస్ వారిదే. ప్రతి ఒక్కరూ ఫెంటాస్టిక్‌గా పెర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా రాశారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. ‘గరుడన్’ సినిమా చూసిన వాళ్లు కూడా ఈ సినిమా చూస్తే చాలా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో నా లుక్‌ని, కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది కూడా డైరెక్టరే. సినిమా చూశాం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా మాకు చాలా నచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.
శ్రీ చరణ్ బ్యూటీఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చింపేసాడు. సినిమా చూసిన అందరూ కూడా ఇదే చెప్తారు.
‘అహం బ్రహ్మాస్మి’ సోలోగా వద్దామని చేసుకున్న కథ. అయితే అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నేను ఒకటి తలిస్తే, దైవం ఇంకొకటి తలచాడు. ‘భైరవం’, ‘మిరాయి’ ఇవన్నీ కూడా దేవుడు ప్లాన్ చేసిన సినిమాలే అనుకుంటున్నాను.
ఈ బర్త్ డేకి చాలా రెజ్యూల్యూషన్స్ తీసు కున్నా. ఈ బర్త్ డే నుంచి నాకు ఒక కొత్త జన్మ మొదలు కాబోతోంది. బర్త్‌డే స్టార్ట్ అవ్వకముందే ఏ స్టేజ్ అయితే మిస్ అయ్యానో దేవుడు మళ్లీ ఇచ్చాడు. 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ సిల్వర్‌స్క్రీన్ మీద కనిపి స్తున్నా. ఇకపై ఎక్కువ టైమ్ సినిమాలకే కేటాయిస్తా. నాన్న (మోహన్‌బాబు) నుంచి నమ్మినోల్ని బాగా చూసుకోవడం, పదిమందికి హెల్ప్ చేయడం నేర్చుకున్నాను. ఆయన కష్టపడుతూ పైకి వచ్చారు. ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో.
– మంచు మనోజ్