Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ముగిసిన 3వ విడత ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన 3వ విడత ఎన్నికలు

- Advertisement -

కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ హవా
నవతెలంగాణ – కన్నాయిగూడెం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో 11 సర్పంచ్ స్థానాలకు ఒక్కటి ముందుగానే ఇనాన్ మాస్ కాగా మిగతా 10 స్థానాలకు41 మంది సర్పంచ్ అభ్యర్థులు, 61వార్డు స్థానాలకు 133మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలంలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కన్నాయిగూడెం మండలం ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఎస్ఐ స్థాయి అధికారి మరియు సివిల్, సీఆర్పీఆఫ్ సిబ్బంది బందోబస్త్ విధుల్లో నియమించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమయిన పోలింగ్ మధ్యాహ్నం 1గంట వరకు 82.78% శాతం నమోదు అయినట్లు మండల ఎన్నికల అధికారి ఎంపీడీఓ అనిత తెలిపారు. ముప్పనపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా తిప్పనపల్లి లస్మయ్య ఒక్కరే నామినేషన్ వేయడంతో సర్పంచ్ ఏకగ్రీవం కావడంతో,2వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జాడి రాంబాబు గెలుపొందారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి పీరీల సురేష్ గెలుపొందారు. ఇక్కడ 4గురు అభ్యర్థులు బరిలో ఉండగా 68 ఓట్ల మెజార్టీతో సురేష్ గెలుపొందగా, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. 8వార్డుల్లో 4స్వతంత్ర, 4కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఐలాపూర్ గ్రామంలో 513 మంది ఓటర్లు ఉండటమే గమనార్హం.

కన్నాయిగూడెం మండలం లక్ష్మిపురం గ్రామపంచాయతీకి 4 అభ్యర్థులు పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అగ్గు రోజ -వెంకటేష్ ప్రత్యర్థి అభ్యర్థులకు చుక్కలు చూపెడుతూ 208 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.కంతనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా చింత చంద్రయ్య గెలుపొందారు..సర్వాయి గ్రామపంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కోరం రాజు గెలుపొందారు.చింతగూడెం గ్రామపంచాయతి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అల్లెం అనిత నర్సింహా రావు గెలుపొందారు.
గూర్రేవుల గ్రామపంచాయతి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అంబాల సౌజన్య-శ్రీకాంత్ గెలుపొందారు. తుపాకులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన పీరీల స్వప్న -ప్రేమ్ గెలుపొందారు..ఏటూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కుర్సం రమాదేవి నాగరాజు గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -