నవతెలంగాణ-హైదరాబాద్: ఒక ప్రభుత్వ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన హిజాబ్‌ను లాగేయడంతో తీవ్ర అవమానానికి గురైన ఒక మహిళా డాక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ నెల 20వ తేదీన ఉద్యోగంలో చేరడానికి నియామక పత్రం అందుకున్నప్పటికీ, ఆ మహిళ విధుల్లో చేరడం లేదని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. ఎదురైన అవమాన భారం కారణంగానే తాను ఉద్యోగంలో చేరడం లేదని ఆమె చెబుతున్నారని ఆయన అన్నారు. ఆమెను ఓదార్చి, ఉద్యోగంలో చేరేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు.
ఈ ఘటన డిసెంబర్ 15న పాట్నాలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా విడుదల అయింది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నివాసంలో జరిగింది. హిజాబ్ ధరించి ఆ మహిళ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, నితీష్ మొదట ఆమెను హిజాబ్ తీయమని సైగ చేశారు. ఆ మహిళ స్పందించకముందే, నితీష్ స్వయంగా ఆమె హిజాబ్‌ను లాగేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. నితీష్ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్‌జేడీ ఈ వీడియోను షేర్ చేస్తూ, ముఖ్యమంత్రి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిందా లేక ఆయన నూటికి నూరు శాతం సంఘ్ పరివార్ వ్యక్తా అని ప్రశ్నించింది. ఈ ఘటన మహిళల పట్ల జేడీయూ, బీజేపీల వైఖరిని నిరూపిస్తుందని ఆర్‌జేడీ అధికార ప్రతినిధి ఇజాజ్ అహ్మద్ అన్నారు. ఈ ఘటన ఖండించదగినదని, నితీష్ కుమార్ రాజీనామా చేయాలని శివసేన, కాంగ్రెస్ పార్టీలు


