Friday, December 19, 2025
E-PAPER
Homeజిల్లాలుపోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధికి రూ.14 కోట్లు విడుదల చేయాలి 

పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధికి రూ.14 కోట్లు విడుదల చేయాలి 

- Advertisement -

చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ 
నవతెలంగాణ ఆలేరు

పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలి అని కేంద్ర జోలి శాఖమంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను ఢిల్లీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరినట్లు చెప్పారు. గురువారం నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కట్ పట్టు చీరలకు దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందని, చేతివృత్తు అయినా చేనేత పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. గతంలో బ్యాంకులు ఇచ్చిన పి ఎం డి బకాయిల వల్ల నిర్వీర్యమై వేలానికి వెళ్లిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి సాంప్రదాయ  నేతన్నల జీవనోపాధి కల్పించిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ & టెక్స్టైల్ మరియు అప్పా రల్ ఎగుమతుల కమిషనర్ ఎన్ హెచ్ డి సి మేనేజింగ్ డైరెక్టర్ కు అధికారికంగా లేఖ అందజేసినట్లు చెప్పారు.

జోలి శాఖ మంత్రి నీ కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు.నిధులు విడుదలయితే హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరించడం స్థానిక నేతనులకు ఉపాధి కల్పన చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్ర జౌళి  మంత్రి దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. భువనగిరి లోక్‌సభ సభ్యులు  చామల కిరణ్ కుమార్ రెడ్డి  కేంద్ర జవళి శాఖ మంత్రి గిర్ రాజ్ సింగ్ జీ ని మరియు డా. బీనా మహాదేవన్,హ్యాండ్లూమ్స్ కమిషనర్ ని కలిసి,యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు అవసరమైన ₹14.00 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

పోచంపల్లి ఇకాట్ హ్యాండ్లూమ్ అభివృద్ధి పథకం కింద ఈ నిధులు అవసరమని ఎంపీ పేర్కొన్నారు.గతంలో బ్యాంకుల నుండి తీసుకున్న పీఎండి రుణాల బకాయిల కారణంగా ఈ హ్యాండ్లూమ్ పార్క్ నిర్వీర్యమై వేలానికి వెళ్లిందని తెలిపారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్‌ను కొనుగోలు చేసి, సంప్రదాయ నేసవృత్తిదారుల జీవనోపాధిని కాపాడుతూ హ్యాండ్లూమ్ కార్యకలాపాలను పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మరియు అప్పారెల్ ఎగుమతి పార్కుల కమిషనర్, గ్రేటర్ నోయిడా లోని ఎన్ హెచ్ డి సి మేనేజింగ్ డైరెక్టర్ కు అధికారికంగా లేఖ రాసి, భారత ప్రభుత్వం – జవళి మంత్రిత్వ శాఖ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. పోచంపల్లి ఇక్కత్ ఉన్న అంతర్జాతీయ గుర్తింపు దృష్ట్యా,ఈ నిధులు విడుదలైతే హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరించబడటంతో పాటు స్థానిక నేసవృత్తిదారులకు ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం మరియు భారతదేశపు విలువైన హ్యాండ్లూమ్ వారసత్వ పరిరక్షణకు దోహదపడుతుందని ఎంపీ తెలిపారు. నేసవృత్తిదారుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని, చారిత్రక పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా, వేగవంతమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -