నవతెలంగాణ – సుల్తాన్ బజార్
నగరంలోని ప్రముఖ సెంట్ ఆన్స్ మహిళా కళాశాలలో బుధవారం ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఇన్వెస్టిచర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోన్ వెటర్నరీ సహాయ సంచాలకులు డాక్టర్. వివేకానంద్, మాట్లాడుతూ ..ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో యువత, ముఖ్యంగా మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఓటు హక్కు ఒక గొప్ప హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన స్పష్టం చేశారు. SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) కార్యక్రమం ద్వారా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు అవగాహన చర్యలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియ, ఫారం–6, ఫారం–7, ఈపిక్ కార్డు, సీ–విజిల్ యాప్ (C-Vigil) వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. నైతిక ఓటింగ్ ప్రాముఖ్యతతో పాటు మొదటిసారి ఓటు వేసే యువతిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఏ. విజయ రాణి, క్లబ్ కన్వీనర్ డాక్టర్. ఆర్. భ్రమరాంబ, ఈ సందర్భంగా ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షురాలిగా షేక్ ఆసియా బేగం, ఉపాధ్యక్షురాలిగా సాక్షి,ఈకార్యక్రమంలో డా. నిషాత్, డా. ఎం. ప్రవీణ, అధ్యాపకులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



