Friday, December 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో కన్నీళ్లే..

గాజాలో కన్నీళ్లే..

- Advertisement -

ఇజ్రాయిల్‌ సైన్యం దాడులు..
తీవ్రమైన చలి..కుప్పకూలిన వైద్యవ్యవస్థ

గాజా : ఇజ్రాయిల్‌ సైన్యం విరుచుకుపడటంతో పాటు తీవ్రమైన శీతాకాల తుఫానుతో గాజాలో వైద్యవ్యవస్థ కుప్పకూలిందని అధికారులు తెలిపారు. 2025 అక్టోబర్‌ 11న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి సుమారు 400మంది మరణించారని అన్నారు. మృతుల్లో శీతాకాల బాధితులు కూడా ఉన్నారని అన్నారు. తీవ్రమైన చలి పరిస్థితులతో 12మంది మరణించారని చెప్పారు. గడిచిన 24గంటల్లో ఇజ్రాయిల్‌ జరిపిన ప్రత్యక్ష కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, మరొకరు గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రోజువారీ నివేదికలో తెలిపింది. అయితే మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడం కూడా నిరాశ్రయుల పట్ల అంతే ప్రాణాంతకంగా మారిందని వెల్లడించింది.

తీవ్రమైన ప్రజారోగ్య విపత్తు వేగంగా పెరిగిందని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గణనీయమైన ఒత్తిని ఎదుర్కొంటోందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-డికాన్‌ హెచ్చరించారు. రోగుల సంఖ్య అందుబాటులో ఉన్న ఆస్పత్రుల సామర్థ్యం కన్నా నాలుగు రెట్లు పెరిగిందని, ముఖ్యంగా శ్వాసకోశ మరియు జీర్ణసంబంధిత వ్యాధులతో సహా అంటువ్యాధులు పిల్లల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఇజ్రాయిల్‌ దురాక్రమణ, విధ్వంసకర మౌలిక సదుపాయాలు మరియు తీవ్రమైన చలి వాతావరణం ..ఇవన్నీ కలిసి తుఫానును సృష్టించాయని, మావనతా సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయని అన్నారు. వైద్య ప్రతిస్పందన సామర్థ్యాన్ని దెబ్బతీశాయని వైద్యులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -