Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం''రుధిరం నుంచి క్షీరం దాకా, అవిభాజ్యం''

”రుధిరం నుంచి క్షీరం దాకా, అవిభాజ్యం”

- Advertisement -

బుక్‌ ఫెయిర్‌లో స్త్రీవాద పుస్తకాల ఆవిష్కరణ
అధ్యాపకురాలు, రచయిత పోరెడ్డి మృదుల


నవతెలంగాణ-సిటీబ్యూరో
అధ్యాపకురాలు, రచయిత పోరెడ్డి(సిరికొండ) మృదుల రచించిన ”రుధిరం నుంచి క్షీరం దాకా’ మరియు ‘అవిభాజ్యం’ అనే స్త్రీవాద సాహిత్య పుస్తకాలను ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ఆవిష్కరించనున్నారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల గ్రామవాసి పోరెడ్డి (సిరికొండ) మృదుల వివిద సబ్జెక్టులు(తెలుగు, సోషియాలజీ, డిప్లమా ఇన్‌ జర్నలిజం)లో పీజీ చేశారు. తెలుగు యూజీ నెట్‌సెట్‌లో ఉత్తీర్ణత పొందారు. 2018లో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ఆరవ పరీక్షలో మొదటి 10వ ర్యాంక్‌ లోపల ఉత్తీర్ణత పొందారు. మల్లీజోన్‌ -2లోని తెలంగాణ సోషల్‌ వెల్పేర్‌ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల ఇబ్రహింపట్నంలో అధ్యాపకురాలుగా విధులు నిర్వహిస్తున్నారు.

వివిద పత్రికల్లో నిరంతరం కవితలు, కథలు రాయడంతో పాటు నూతనంగా ”రుధిరం నుండి క్షీరం దాకా’ మరియు ‘అవిభాజ్యం’ అనే స్త్రీవాద సాహిత్య రచనలు చేశారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ద్వారా పబ్లిష్‌ చేసిన పుస్తకాలను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ వెల్దండ నిత్యానందరావు చేతుల మీదుగా బుక్‌ ఫెయిర్‌లో పుస్తకాల ఆవిష్కరణ జరగనుంది. కవితా సంపుటాలలో పూర్వ వర్తమాన స్త్రీల పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న, అనుభవిస్తున్న ప్రతి బాధను చాలా సున్నితంగా తట్టారని వివిద కళాశాలల ఆచార్యులు పుస్తక సంపుటాలను విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -