న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఓ మహిళా వైద్యురాలి హిజాబ్‌ను తొలగించడాన్ని గేయ రచయిత జావేద్ అక్తర్ తీవ్రంగా ఖండించారు. ఆ వైద్యురాలికి నితీశ్‌కుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్‌మీడియా వేదికగా గురువారం ఆయన ఈ ఘటనను ఖండించారు. ”మహిళలు సాంప్రదాయకంగా పాటించే పరదా (ముసుగు)ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. అంటే దానర్థం.. ఒక ముస్లిం వైద్యురాలి పట్ల నితీశ్‌కుమార్ వ్యవహరించిన తీరుని ఎంతమాత్రం సమర్దిస్తామని కాదు. ఈ దుశ్చర్యను నేను అత్యంత కఠిన పదజాలంతో ఖండిస్తున్నాను.
నితీశ్ కుమార్ వెంటనే ఆ మహిళా వైద్యురాలికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక ముస్లిం మహిళా వైద్యురాలి పట్ల ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను నితీశ్ కుమార్ బలవంతంగా లాగడంతో విమర్శలు వస్తున్నాయి. ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం సందర్భంగా సోమవారం ఈ ఘటన జరిగింది.
నితీష్‌కుమార్ చర్యపై జావేద్ అక్తర్ ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



