Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంసాహిత్య పురస్కారాలకు కేంద్రం ఆమోదం కోరడం సరికాదు

సాహిత్య పురస్కారాలకు కేంద్రం ఆమోదం కోరడం సరికాదు

- Advertisement -

ఎంఎ బేబి

న్యూఢిల్లీ : సాహిత్య అకాడమీ తన పురస్కారాల సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి పంపడాన్ని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం ఎ బేబీ తీవ్రంగా ఖండించారు. సాహిత్య అకాడమీ వంటి స్వయంప్రతిపత్తి సంస్థ తన చరిత్రలో మొదటిసారిగా అధికార పార్టీకి లొంగిపోయిందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వారి ఆమోదాన్ని కోరడం సరికాదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం సెక్రటరీ లేకుండా పనిచేస్తున్న అకాడమీ ప్రభుత్వ అనుమతి కోసం మోకరిల్లడం దాన్ని స్థాపించిన వారి ఆశయాలకు చేసిన ద్రోహమన్నారు. భారతదేశ సాంస్కృతిక సంస్థలను తమ ఇష్టానుసారం నడిపించాలనే మోదీ, షా, భగవత్‌ త్రయం ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోషల్‌ మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. సాహిత్యం, వాక్‌ స్వాతంత్య్రాన్ని ప్రేమించే వారందరూ దీన్ని ప్రతిఘటించాలని, ఐక్యంగా వ్యతిరేకించాలని బేబీ పిలుపునిచ్చారు. సాహిత్య అకాడమీ దశాబ్దాలుగా స్వతంత్రంగా పురస్కార గ్రహీతలను ఎంపిక చేసుకునే సంప్రదాయాన్ని కలిగి ఉందన్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపి ఆమోదం కోరడం సంస్థ యొక్క స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తుందన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -