Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ రుణ పరిమితికి కేంద్రం కోత

కేరళ రుణ పరిమితికి కేంద్రం కోత

- Advertisement -

రూ. 5,944 కోట్లు తగ్గింపు

తిరువనంతపురం: బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే చర్యలకు మోడీ ప్రభుత్వం దిగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీసి అధికారంలో రావటానికి అడ్డదిడ్డమైన చర్యలకు పాల్పడుతోంది. తాజాగా కేరళ రుణపరిమితికి కేంద్రం కోతపెట్టింది. కేరళ ఆర్థిక పునాదులను బలహీనపరిచే లక్ష్యంతో మరోసారి ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేంద్రం కేరళ రుణ పరిమితిని మరింతగా తగ్గించింది. ఈ కోత మొత్తం రూ. 5,944 కోట్లు. దీని ఫలితంగా రూ. 12,516 కోట్లు అప్పు తీసుకునేందుకు అనుమతి ఉన్నప్పటికీ, కేరళ ఇప్పుడు కేవలం రూ. 6,572 కోట్లు మాత్రమే సమీకరించగలదు.

కేఐఎఫ్‌బీఐ, పెన్షన్‌ కంపెనీలు తీసుకున్న రుణాలను రాష్ట్ర మొత్తం రుణ పరిమితిలో చేర్చాలని వాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను సమర్థించుకుంది. గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఓ సమావేశంలో కేరళ రుణపరిమితిపై ఆంక్షలు సడలించాలని ప్రధానమంత్రిని అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనలను తిరస్కరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కోతను అమలు చేసింది.రాష్ట్రం ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడానికి కేంద్రం ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవడమే దీని వెనుక ఉన్న రాజకీయ లక్ష్యం అని స్పష్టమవుతోంది. రుణ పరిమితి తగ్గింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక విభాగానికి ఒక అధికారిక లేఖను సైతం పంపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -