Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఒత్తిడికి గురై ఎంపీడీవో మృతి

ఒత్తిడికి గురై ఎంపీడీవో మృతి

- Advertisement -

హనుమకొండ జిల్లా ఆత్మకూరులో ఘటన

నవతెలంగాణ-వెంకటాపురం
ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు చెల్లించాల్సిన పారితోషికం విషయంలో తక్కువ చెల్లిస్తున్నారంటూ సిబ్బంది వాగ్వివాదానికి దిగడంతో ఒత్తిడికి గురైన ఎంపీడీవో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరులో జరిగింది. కార్యాలయం సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరుకు చెందిన జి. రాజేంద్ర ప్రసాద్‌.. వెంకటాపురంలో ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్యం బాగా లేని కారణంగా కొంతకాలంగా సెలవుపై ఉన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తిరిగి విధుల్లో చేరారు. బుధవారం మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి.

ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారులకు ఓట్ల లెక్కింపు అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వారికి చెల్లించాల్సిన పారితోషికం తక్కువగా చెల్లిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. దాంతో ఒత్తిడికి గురైన ఎంపీడీవో సమీప టీ స్టాల్‌ వద్దకు వెళ్లి కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు, కార్యాలయ సిబ్బంది వెంటనే వెంకటాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి ములుగు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీపీఆర్‌, తదితర పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు తరలించారు. వరంగల్‌లోని ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -