Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన గ్రామీణ వైద్యులు

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన గ్రామీణ వైద్యులు

- Advertisement -

పలువురు గ్రామీణ వైద్యుల అభినందనలు
నవతెలంగాణ – మల్హర్ రావు

పల్లెల్లో 24 గంటలు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులు మరింత సేవలందించడానికి ఒక్కఅడుడూ..ముందుకేశారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో గత నాలుగైదు సంవత్సరాలుగా తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తాడిచెర్ల గ్రామానికి చెందిన వొన్న తిరుపతి రావు సింగిల్ డైరెక్టర్ రైతులకు సేవలందిస్తున్నారు.

అలాగే ఇటీవల ప్రభుత్వం  నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తిరుపతి రావు తాడిచెర్ల 9వ వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన జంబోజు సంధ్యరాణి-రవి 9వ వార్డు సభ్యులుగా,ఇదే గ్రామానికి చెందిన కేశవ చారి 8వ వార్డు సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఎన్నికైన ముగ్గురు అధికారపార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వీరు ఎన్నికల అధికారులతో ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు సైతం అందుకున్నారు. వీరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పట్ల పలువురు గ్రామీణ వైద్య మిత్రులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -