– 17మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలో విషాదకరం :
– మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– గుల్జార్ హౌజ్ ప్రమాద స్థలం సందర్శన.. బాధితులకు పరామర్శ
నవతెలంగాణ – ధూల్ పేట్/ రాజేంద్రనగర్
అంబులెన్స్‌లో మౌలిక వసతులైన ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైర్ ఇంజిన్‌లో నీళ్లుంటే గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదని మాజీ మంత్రి, బీఅర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రమాద స్థలాన్ని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన సోమవారం సందర్శించారు. అదేవిధంగా ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని అత్తాపూర్ సన్రైస్ విల్లాలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైర్ బ్రిగేడ్‌కు సరైన మాస్కులు లేకపోవడంతో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారన్నారు. ప్రభుత్వం అందాల పోటీలపై పెట్టిన శ్రద్ధ, ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనపై పెడితే బాగుంటుందన్నారు. గుల్జార్ హౌస్ గురించి తెలియని వాళ్లు హైదరాబాద్, తెలంగాణలో ఎవరూ లేరన్నారు. చార్మినార్ దగ్గర 125 ఏండ్ల నుంచి ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఎవరినీ నిందించడం లేదని, కానీ వారు కొన్ని విషయాలు చెప్పారని అన్నారు. ఫైర్ బ్రిగేడు నీళ్లు లేకుండా వచ్చిందని, అంతేకాక వాళ్లు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రమాద బాధితులకు పరామర్శ
గుల్జర్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 17 మందిలో 10 మంది రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని అత్తాపూర్ సన్రైస్ విల్లాలో ఉండేవారు. ఆ కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. అగ్ని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సకాలంలో సహాయక చర్యలు చేపడితే కొంతమంది బతికే వారని అన్నారు. అదేవిధంగా అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవడంతో కొంతమంది చనిపోయారని ఆరోపించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమ్మద్ అలీ, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
అంబులెన్స్‌లో మౌలిక వసతులుంటే ప్రాణ నష్టం తగ్గేది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES