Friday, December 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆస్ట్రేలియా ఉగ్రదాడికి హైదరాబాద్‌కు సంబంధం లేదు: డీజీపీ

ఆస్ట్రేలియా ఉగ్రదాడికి హైదరాబాద్‌కు సంబంధం లేదు: డీజీపీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాల్పులకు పాల్పడిన సాజిద్‌ అక్రమ్‌ హైదరాబాద్‌కు చెందినవాడే అయినప్పటికే ఉగ్రఘటనతో హైదరాబాద్‌కు సంబంధం లేదని వెల్లడించారు. 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్రమ్ ఆరు సార్లు భారతదేశానికి వచ్చాడన్నారు. పెళ్లి అయ్యాక 1998లో భార్యతో పాటు హైదరాబాద్ మొదటిసారి వచ్చినట్లు తెలిపారు. బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -