తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ప్రజాప్రంట్ నాలుగవ మహాసభలు విజయవంతం చేయాలని ప్రజాప్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కొయ్యూరు గ్రామంలో కొమరం భీం విగ్రహం దగ్గర తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగవ మహాసభల కనపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి కాబోతున్నది రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు 40, సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం నడిపారని,ఈ క్రమంలో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు.
వ్యక్తులుగా శక్తులుగా సంస్థలుగా తెలంగాణ సమాజం సంవాదం నడిపింది సంభాషించింది రగిలిపోయిందన్నారు.మొదటి దశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యోగుల విద్యార్థులు చురుకుగా 360 మంది విద్యార్థులు పోలీసు స్థూటాలకు బలయ్యారని తెలిపారు.తర్వాత కాలంలో ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూ తెలంగాణ ఆకాంక్షలు సజీవంగా ఉంచారన్నారు. 90వ దశకంలో దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు మరోసారి ఎజెండ పైకి వచ్చిందన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నేలలో ప్రధాన విప్లవ పార్టీగా ఉన్న పీపుల్స్ వార్ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలపరిచే డాక్యుమెంట్ను విడుదల చేసిందన్నారు.ఆ డాక్యుమెంట్ ప్రజలను ప్రజాసాంకవాదులను మేధావులను కళాకారులను విశేషంగా ప్రభావితం చేసిందన్నారు.
ఈ క్రమంలో భువనగిరి డిక్లరేషన్,సూర్యాపేట డిక్లరేషన్,వరంగల్ డిక్లరేషన్లు తెలంగాణ సమాజంలొ పెద్ద కదలికను తీసుకువచ్చాయని,మేధావులు ఒకవైపు కవులు కళాకారులు మరోవైపు సాహిత్య కృషి చేశారన్నారు. తెలంగాణ జన సభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ మహాసభ, తెలంగాణ సంస్కృతి, వేదిక తెలంగాణ స్టడీ ఫోరం వంటి సంస్థలు ఏర్పాడి నిర్మాణాత్మక కృషి చేశాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి,తెలంగాణ అసంకటిత కార్మిక సమాఖ్యల రాష్ట్ర కార్యదర్శి ఐదు బాపు,ఆదివాసి మహిళా నాయకురాలు గడ్డం సమ్మక్క,దళిత నాయకురాలు మేకల కళ,బిసి మహిళా నాయకురాలు సెన్నవనేని నర్సక్క పాల్గొన్నారు.



