Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేకల రాజన్న గెలుపుతో కాంగ్రెస్ సంబరాలు

మేకల రాజన్న గెలుపుతో కాంగ్రెస్ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన అభ్యర్థి మేకల రాజయ్య యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ,యూత్ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు నిర్వహించారు. తన గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలకు సర్పంచ్ రాజన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న బిఆర్ఎస్ కోటను ముక్కలు చెసిన రాజన్నను పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్నెని ప్రకాష్ రావు, రూపేస్ రావు, ఆగమ రావు, జలపతి రావు, సుర్నేని రవిందర్ రావు, పొల్సాని రవిందర్ రావు, లింగన్నపేట మురళి, కట్టెకొల్ల మల్లయ్య, మాధారపు రాజేశ్వర్ రావు, యూత్ నాయకులు మేకల అనిల్ యాదవ్,కల్వల రవి సాగర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -