ఎంఏ ఇక్బాల్ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
2025 ఉపాధి హామీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ చట్ట సవరణ కాపీలు దగ్ధం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఆలేరు పట్టణంలో చట్ట సవరణ కాపీలను శుక్రవారం నాడు దగ్ధం చేయడం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌలు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం కోసం అనేక కుతంత్రాలను పన్నుతోందని 2005లో కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ఫలితంగా పేదలకు పనైనా చూపండి కూడైనా పెట్టండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల ప్రతిఫలంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకువచ్చారని అన్నారు.
ఈ పథకం ద్వారా దేశంలోఅనేక ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కార్మికులు తమ స్వస్థలంలోనే ఎంతోకొంత పని వెసులుబాటు కలిగి కలో గంజో తాగే పరిస్థితి వచ్చిందని చట్టంలో సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలని ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుండి 50 నుండి 60 రోజులు మాత్రమే పని కల్పించింది. అంతేకాకుండా పాత చట్టంలో యంత్రాల ద్వారా పనిచేసే విధానం 10 శాతానికి మించొద్దని ఉన్నప్పటికీ ప్రస్తుతం దాన్ని 60 శాతానికి పెంచడం అంటే పేద ప్రజల నోటి కాడ బుక్క గుంజుకోవడమే అవుతుందని యంత్రాలతో పని చేయించే అవకాశం ఉన్నప్పుడు పేదలకు పని ఎలా దొరుకుతుందని వారు ప్రశ్నించారు. గత 2025 చట్టంలో ఉపాధి హామీ వెచ్చించే ఖర్చులో 10% రాష్ట్ర వాటా 90% కేంద్రం వాటా భరించాలని ఉన్నప్పటికీ నూతనంగా తీసుకువచ్చిన చట్టంలో రాష్ట్రం 40% వాటా కేంద్ర ప్రభుత్వం 60% వాటాగా నిర్ణయించడం వలన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి పేదలకు పని కల్పించే పరిస్థితి లేకుండా పోతాయని ఈ భారాన్ని మోయలేవు అని రాష్ట్ర ప్రభుత్వాలు కరాకండిగా చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా ఈ చట్టా సవరణ చేసింది.
ఈ చెట్టు సవరణపై పార్లమెంటరీ స్థాయి కమిటీ నియమించి చర్చించాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ నియంతృత్వ పద్ధతిలో ఈ చట్ట సవరణ చేశారని అన్నారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ పథకాన్ని గాడ్సే వారసులైన బిజెపి పాలకులు మార్చడంలో ఆశ్చర్యం లేదు కానీ ఆ పథకం యొక్క స్ఫూర్తి దెబ్బ తినే విధంగా పేదల కడుపు కొడితే రానున్న రోజుల్లో ఉపాధి హామీ ద్వారా లబ్ధి పొందిన కోట్లాది కుటుంబాలు బిజెపి పాలకులకు తగిన బుద్ధి చెప్తాయని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోరిగాడి రమేష్,మోరిగాడి చంద్రశేఖర్,వడ్డేమాన్ బాలరాజు,సూద గాని సత్య రాజయ్య,తాళ్లపల్లి గణేష్,బొప్పిడి యాదగిరి,కాసుల నరేష్,యాసారపు ప్రసాద్,బొమ్మ కంటి లక్ష్మీనారాయణ,కారే రాజు,బర్ల సిద్ధులు,ఎండి ఖలీల్,ఎండి అఖిల్ ఘనగాని రాజు,మొరిగారి అంజయ్య మొరిగాడి అశోక్, మద్దె బోయిన ఉప్పలయ్య, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.



