నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రస్తుతం పరిస్థితుల్లో రైతులకు కూలీల కొరత ఉన్నందున వరి వెదజల్లే పద్ధతి ద్వారా అధిగమించవచ్చని సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధి చింత శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో శబరిష్ అనే రైతు పొలంలో నేరుగా వేసే విత్తనాల పరికరం ద్వారా వేసిన వరి పొలంను సుస్థిర వ్యవసాయ కేంద్ర ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి వెదజల్లే పద్ధతిపై రైతులకు సూచనలను అందించారు. ప్రస్తుతం రైతులకు కూలీల కొరత ఉన్నందున వరి వెదజల్లే పద్ధతిని అవలంబించాలని రైతులకు సూచించారు. అనంతరం గ్రామానికి చెందిన కొట్టాల మహేందర్ అనే రైతు నేరుగా వరి వెదజల్లే పద్ధతి ద్వారా విత్తనాలు వేసినా పొలం సందర్శించి తగిన సూచనలు చేశారు. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు ఖర్చు తగ్గి, పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులకు వివరించారు.
వరి వెదజల్లే పద్ధతితో రైతులకు ఎంతో మేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



