నవతెలంగాణ – సుల్తాన్ బజార్
తెలంగాణా ప్రభుత్వం.వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ,పౌర సరఫరాల శాఖ జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలను నాంపల్లి సర్కిల్ పౌరసరఫరాల సహాయ అధికారి పుష్పలత ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పౌరసరఫరాల జిల్లా సివిల్ సప్లై అధికారి కె శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ జస్టిస్ ద్వారా, డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా వినియోగదారుల హక్కుల కేసులు పరిష్కారం అవుతున్నాయి అన్నారు.
వినియోగదారు తమ హక్కులను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ స్పెక్టర్ , తూనిక కొలతల అధికారి శ్రీనివాస్ రెడ్డి, డి సి ఐ సి అధ్యక్షులు పి చంద్రశేఖర్, వాణిజ్య విభాగ అధిపతి నరసింహులు, సి ఎ టి సి ఓ చైర్మన్ వి గౌరీ శంకర్ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్, పౌరసరఫరాల అధికారులు పుష్పలత, బుష్రా సుల్తానా, సురేందర్ నర్సింగ్ రాజు అస్లాం ఖాన్,, సివిల్ సప్లై అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



