నవతెలంగాణ – హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇజెహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్‌నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మంత్రి శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సిఇఒ ఉదయ్‌కుమార్, డిఎంఇ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వెల్‌సెట్ సెంటర్లలో ఇకపై జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జర్నలిస్టులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్
- Advertisement -
- Advertisement -



