- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాంలో జరిగిన రైలు ప్రమాదంలో 8 ఏనుగులు మృతిచెందాయి. సాయిరంగ్-న్యూఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. అస్సాంలోని హోజాయ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 2.17 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఏనుగులను ఢీకొన్న రైలు పట్టాలు తప్పింది. అయిదు బోగీలు డిరేల్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదు.
- Advertisement -



