Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్

జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో బాధితురాలు టీఎఫ్‌టీడీడీఏ ప్రెసిడెంట్ వి.వి. సుమలతా దేవిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను వేధించిన జానీ మాస్టర్‌ను రక్షించేందుకు సుమలత ప్రయత్నిస్తున్నారని, తన పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో చట్టం కింద నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సమంజసం కాదని ఆమె ప్రశ్నించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -