ప్రెసిడెంట్, సెక్రటరీలతో అల్లీపురం వెంకటేశ్వర్
ముంబయి: తొమ్మిది దశాబ్దాలుగా సమాన అవకాశాలు, కనీస మౌలిక సదుపాయాలు లేక అత్యంత దారుణంగా నిరాధారణకు గురైన గ్రామీణ తెలంగాణ క్రికెట్ కు ప్రత్యేక క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుతోనే న్యాయం చేకూరుతుందని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం సందర్భంగా ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవాజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలను కలిసిన అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు అంశంపై బీసీసీఐ ఏజీఎం లో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీసీఏకు గుర్తింపు అందించి, ప్రతిభావంతులైన తెలంగాణ క్రికెటర్లు దేశవాళీ, తద్వారా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాలని అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
టీసీఏకు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



