ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు
నవతెలంగాణ-హైదరాబాద్
ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్ సహా హన్మకొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం వేదికగా జరుగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను (అండర్-18) సమన్వయంతో పని చేసి విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. క్రీడాశాఖ ముఖ్య ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలిసి సంజయ్ జాజు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘జాతీయ క్రీడల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన టోర్నమెంట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి క్రీడలను విజయవంతం చేయాలని’ సంజయ్ జాజు తెలిపారు.
సమన్వయంతో పని చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



