Sunday, January 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌..వ‌రుస సెల‌వులు

విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌..వ‌రుస సెల‌వులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విద్యార్థుల‌కు ఈ ఏడాది, క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. ఈసారి, చాలా స్కూళ్లకు రెండు రోజుల సెలవులు మాత్రమే ప్రకటించారు. కొన్ని పాఠశాలలకు 5 రోజుల సెలవులు కూడా వచ్చాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకోవడమే కాక, ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు అన్నింటికి సెలవు ఉంటుంది. మరుసటి రోజు, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా సెలవులు ప్రకటించారు.
డిసెంబర్ 27న శనివారం మినహాయించి, కొంతమంది స్కూల్‌లు పనిచేస్తాయి, మరికొంతమంది స్కూల్స్ హాఫ్ డే ఉంటాయి. డిసెంబర్ 28 ఆదివారం కూడా సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది, డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 28 వరకు సెలవులు ఉంటాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించే ముందు, FA III పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు డిసెంబర్ 23న ముగియనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్ 24 నుండి క్రిస్మస్ పండుగ వేడుకలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగా, స్కూళ్లకు సెలవులు ప్రారంభమవుతాయి. ఇంకా సెలవుల ప్రకటనలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -