నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినందున కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను శుక్రవారం టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగ నిర్వహించిన్నoదుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షులు ఎన్.వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు ల ఆధ్వర్యంలో సంఘ నాయకులతో కలసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల పలు సమస్యలపై విన్నవించగ కలెక్టర్ సానుకూలంగ స్పందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, నాలుగోతరగతి ఉద్యోగుల కృషి వల్ల ఎలక్షన్స్ విజయవంతంగా నిర్వహించారాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సంఘ బాధ్యులు కే శివకుమార్, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సంయుక్త కార్యదర్శి రమణ కుమార్, పబ్లిసిటీ కార్యదర్శి రాజ్ కుమార్, ఎల్లారెడ్డి తాలూకా అధ్యక్షులు మహిపాల్, దోమకొండ కార్యదర్శి అల్లాడి రమేష్, అర్బన్ ఈసీ మెంబర్ అనుదీప్ రెడ్డి, నరేష్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



