Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ కు సన్మానం

మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలుపొందిన మేకల రాజయ్య యాదవ్ ను అఖిలభారత యాదవ మహాసభ మల్లారం అధ్యక్షుడు వేముల శేషు యాదవ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మల్లారం గ్రామ చరిత్రలోనే గతంలో యాదవులు ఎప్పుడు లేనివిధంగా ఒకతాటిపై నిలబడి ప్రోత్సాహించడం ద్వారానే రాజన్న గెలుపు సాధ్యమైయిందన్నారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పాగా వేసిన  బిఆర్ఎస్ ను కోటను చిల్సి ముక్కలు చెసిన ఘనత యాదవులదేన్నారు. ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల సత్తయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కట్టెకొల్ల నరేశ్ యాదవ్, వేల్పుల రవి యాదవ్, ముక్కనవేన ఐలయ్య యాదవ్, మేకల హరీష్ యాదవ్, సంజివ్ యాదవ్, నవీన్ యాదవ్, అనిల్ యాదవ్, శేఖర్ యాదవ్, మల్లయ్య యాదవ్, దుర్గమ్మ యాదవ్, సిద్ధి రాకెష్ యాదవ్, వంశీ యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రవి సాగర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -