నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాటారం డివిజన్ లో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొందరు ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉన్నారు. చాలా మంది దూరప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేసి స్ఫూర్తిని చాటారు. కాటారం, మల్హర్, మహము త్తారం, మహదేవపూర్ మండలాల్లో మొత్తం 98,052 మంది ఓటర్లుండగా, వీరిలో 82,155 మంది ఓటేశారు. మిగిలిన 15,937 మంది ఓటుకు దూరంగా ఉన్నారు.మహముత్తారంలో మొత్తం 20,286 ఓటర్లు ఉండగా 17,319 మంది ఓటు వేయగా,2,967 ఓటుకు దూరంగా ఉన్నారు.
మల్హర్ మండలంలో మొత్తం 21,547 మంది ఓటర్లు ఉండగా 18,057 ఓటువేయగా, 3,490 ఓటుకు దూరంగా ఉన్నారు.మహాదేవపూర్ మండలంలో మొత్తం 25,434 ఓటర్లు ఉండగా,21,408 ఓటు వేయగా,4,026 ఓటుకు దూరంగా ఉన్నారు. కాటారం మండలంలో మొత్తం 30,785 ఓటర్లు ఉండగా, 25,331 ఓటు వేయగా 5,454 ఓటుకు దూరంగా ఉన్నారు. మొత్తం మీద డివిజన్ వ్యాప్తంగా 15,937 మంది ఓటులో పాల్గొనలేదు.



