యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ప్రభుత్వం మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని రద్దుచేసి వీబీజీ రామ్ జీ 2025 పథకంగా మార్చడాన్ని నిరసిస్తూ యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. మహత్మా గాంధీ పేరును తొలగించి..వీబీ రామ్ జీ సంక్షిప్త నామాన్ని తేవడాన్ని వ్యతిరేకించారు.ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసి పని రోజులను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 90శాతం ఉన్న వాటాను 60శాతానికి కుదించడమంటే చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులను దెబ్బతీస్తూ 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం ముసాయిదా బిల్లులో పెట్టడం దుర్మార్గమన్నారు.
ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



