– వీకేడీవీఎస్ రాజు కళాశాల ఆద్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
శ్రీనివాస రామానుజన్ జయంతి (డిసెంబర్ 22 శనివారం) ని పురస్కరించుకొని శనివారం వీకేడీవీఎస్ కళాశాల ఆద్వర్యంలో గణిత ప్రతిభా పరీక్ష( మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్) నిర్వహించారు. దీనిలో 8 ప్రభుత్వ పాట శాలలు,3 గురుకుల పాఠశాలలు,6 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మొత్తం 69 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ ప్రతిభా పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రధమ బహుమతి ని స్థానిక టీజీ ఎంఆర్ఎస్ విద్యార్ధిని ఎస్కే నజియా రూ.3000 లు, ద్వితీయ బహుమతి ని దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధిని ఎండీ సుహాన్ తంకిన్ రూ.2000 లు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిళ్ళవారిగూడెం విద్యార్ధిని ఎం.ప్రవీణ్ రూ.2000 లు గెలుచుకున్నారు.
మూడో బహుమతి ని ఏజీహెచ్ఎస్ అనంతారం విద్యార్ధిని లాస్య భారతి,జెడ్పీ హెచ్ ఎస్ అశ్వారావుపేట విద్యార్ధిని డి.సహాస్ర,పీ.హర్షిత లు రూ.1000 చొప్పున గెలుచుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో మొదటి బహుమతి ని అశ్వారావుపేట జవహర్ విద్యాలయం విద్యార్ధిని కాత్యాయని రూ.3000 లు, ద్వితీయ బహుమతి ని శ్రీ గౌతమి పాఠశాల విద్యార్ధిని లిఖిత,దమ్మపేట సెయింట్ మేరీ స్కూల్ విద్యార్ధిని ఎన్.రీనా రూ.2000 లు చొప్పున సాధించారు తృతీయ బహుమతి ని జవహర్ విద్యాలయం విద్యార్ధిని టీ.హాసినీ, మనస్విత,సూర్య స్కూల్ విద్యార్ధిని సువర్ణ, గుడ్ న్యూస్ విద్యార్ధిని ఎస్.ఈశ్వర్ ఆనంద్ లు తలో రూ.1000 లు చొప్పున గెలుచుకున్నారు.
మొత్తం 13 మంది విద్యార్ధులకు రూ.21000 లు నగదు బహుమతులు అందచేయడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ విద్యార్ధులను పాల్గొనే విధంగా ప్రోత్సహించి పంపించిన ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్ధి ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు.


