Sunday, December 21, 2025
E-PAPER
Homeఖమ్మంయోగాతో మనో ఉల్లాసం

యోగాతో మనో ఉల్లాసం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
మండల పరిధిలోని ఆసుపాక ప్రాధమికోన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్యాన నిర్వహకులు ఏరువాక సత్యవతి, అత్తే మౌనిక లు విద్యార్ధులు,ఉపాధ్యాయులు, గ్రామస్తులతో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన జరుపుకునే విధంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందన్నారు.ప్రపంచ వ్యాప్తంగా శాంతి,సామరస్యాన్ని పెంపొందించటం ముఖ్య లక్ష్యమన్నారు.మానసిక ఆరోగ్యం ప్రోత్సహించటం తో పాటు మనో వేదనను తగిస్తుందన్నారు.బ్రహ్మర్షి పత్రి జీ జీవిత చరిత్రను వివరించారు.అనంతరం స్వీట్లు,పాయసం,చాక్లెట్లు పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి,ఉపాధ్యాయులు కట్టా శ్రీనివాస్,రామినేని రాంప్రసాద్,నాగలక్ష్మి,లక్ష్మి, సాల్మన్,రవి,సైదులు,రాజేశ్వరి, బిర్రం ప్రత్యూష,సర్పంచ్ సోడెం ఆదిలక్ష్మి,మాజీ సర్పంచ్ కె లింగయ్య,మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి,భూక్యా మేగ్యా, వీర్నాల నాగు,కరీం,మల్లిఖార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -