నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ గా ఎన్నికైన మొట్టమొదట ఆలయానికి వచ్చి పూజలు చేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులకు ఆలయం తరఫున ఆలయ పూజారి గంగారం శాలువలతో ఘనంగా సన్మానించారు. ఆలయ పూజారి తో పాటు ఆలయ గల్లీలో వార్డు మెంబర్ గా పోటీ చేసిన సందూర్ వార్ అశోక్ దంపతులు సర్పంచ్ దంపతులకు ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించారు. ఆలయ సందర్శన కోసం ప్రత్యేక పూజలు కోసం వచ్చిన ఉష సంతోష్ మేస్త్రికి గల్లి పెద్దలు పలువురు పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ.. ఈ గల్లి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ హనుమాన్లు, ఆలయ పూజారి గంగారాం, ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్, సాయినివార్ భారత్, సందుర్వార్ కుటుంబ పరివార్ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



