- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం పెద్దతూండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలో చదువుతున్న అంజి, రామ్ చరణ్, జశ్వంత్ లు శనివారం మండల కేంద్రమైన తాడిచెర్ల హైస్కుల్లో నిర్వహించిన మండల స్థాయి మాథ్స్ ఒలంపియాడ్ టెస్టులో ప్రతిభ కనబర్చారు. అంజి మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించి జిల్లా స్థాయికి ఎంపికైయ్యాడని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.తిరుపతి తెలిపారు. విద్యార్థులను అలాగే గైడ్ టీచర్ మానస మేడంను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సిహెచ్ శర్మ , ఎండి యాకూబ్ పాషా, ఐత మహేందర్, మందల సుజాత, చంద్ర ప్రకాష్, ఓఎస్ సందీప్, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



