నవతెలంగాణ-పాలకుర్తి
అధికార పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన మల్లంపల్లి ప్రజలు ప్రతిపక్ష పార్టీలకే మద్దతును ప్రకటిస్తున్నారు. ప్రజల మద్దతుతో ప్రతిపక్ష పార్టీల నాయకులే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుచున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి విచిత్రమైన చరిత్ర. 2001లో టిడిపి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. 2019లో రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అధికార పక్షాన్ని కాదనకుండానే మరో మారు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు.
అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్న వాటికి విరుద్ధంగా మల్లంపల్లి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీర్పు ఇవ్వడంతో గ్రామాభివృద్ధి కొంతమేర కొంత మేర కుంటు పడుతుందని చెప్పుకోవచ్చు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షానికి పట్టం కట్టకుండానే ప్రతిపక్ష పార్టీకి పట్టం కట్టారు. దీంతో మండలంలో అన్ని గ్రామాలకు ఒక చరిత్ర ఉంటే మల్లంపల్లికి ప్రత్యేక చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు.



