Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్వో కార్యాల‌యాన్ని త‌నిఖీ చేసిన ట్రైనీ క‌లెక్ట‌ర్‌

ఎమ్మార్వో కార్యాల‌యాన్ని త‌నిఖీ చేసిన ట్రైనీ క‌లెక్ట‌ర్‌

- Advertisement -

నవతెలంగాణ – మునిప‌ల్లి
మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి ఎమ్మార్వో కార్యాల‌యాన్ని శ‌నివారం నాడు ట్రైనీ క‌లెక్ట‌ర్ ప్ర‌తిభా శేఖ‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అనంత‌రం రెవెన్యూ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను సమయంలో ఒక నివేదిక మండల ఆర్ ఐ ద్వారా రావాలన్నారు. అలాగే మీకు ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాలకు వెళ్లి రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ స‌మావేశంలో మునిప‌ల్లి తహసిల్దార్ గంగాభవాని, డిప్యూటీ తసిల్దార్ మర్రి ప్రదీప్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుభాష్, గ్రామ పాలన అధికారులు అంజన్ కుమార్ యాదవ్, చంద్రప్రకాష్, నర్సింలు, శివగౌడ్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -