నవతెలంగాణ – భీంగల్
మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు నాగేంద్ర యువసేన ద్వారా శనివారం క్రీడా దుస్తులను అందజేశారు. ఈరోజు భీంగల్ మండల కేంద్రంలో 69వ మండల స్థాయి క్రీడోత్సవాల సందర్భంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో క్రీడలలో పాల్గొననున్న 50 మంది విద్యార్థినులకు నాగేంద్ర యువసేన తరపున క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర యువసేన వారు మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యాలయంలోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుంకరి సురేష్, నిచ్చేమొల్ల మహేష్, సయ్యద్ రెహమాన్ కంకణాల వంశీ కృష్ణ, సంపత్, శివ బాలాజీ , శివ, నాగేంద్రన్న యువసేన సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



