ఆదిసాయికుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహిధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాలా’. యుగంధర్ ముని దర్శకుడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మహీధర్‌రెడ్డి, రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ,’కథలో డివోషనల్, హర్రర్ ఎలిమెంట్స్ మాకు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాని ఆదితో తెరకెక్కించాం. స్టోరీ పరంగా ఇది టోటల్ డిఫరెంట్ సినిమా. ఏ సినిమాతో దీనికి పోలిక లేదు. సినిమాకు బలం కంటెంటే. ఆదికి తెలుగులోనే కాకుండా హిందీలోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో హిందీలో విడుదల చేస్తాం.
‘కల్కి’ వచ్చిన తరువాత శంబాలా అనేది అందరికీ తెలిసింది. శంబాలాకి ఓ మీనింగ్ ఉంది. ఆ ప్లేస్ ఏంటి?, దాని మీనింగ్ ఏంటి? అనేది ఈ సినిమాలో చూస్తారు. అలాగే ఈ సినిమాలో హర్రర్‌తోపాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం మా సినిమాకి పెద్ద ఎస్సెట్. విజువల్‌తో పాటు మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. మా దర్శకుడు సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మా సినిమా చూసి ఆహా వాళ్ళు ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. మైత్రి వాళ్ళు నైజాం రైట్స్ తీసుకుని, రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఏపీ, సీడెడ్ ఉషాపిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన బిజినెస్‌తో 80%తో సేఫ్ జోన్‌లోకి వచ్చాం. ఇంకో 20% శాతం రికవరీ రావాలి. అయితే థియేట్రికల్ రన్‌తో లాభాల్లోకి వస్తామని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
భిన్నమైన సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



