Sunday, December 21, 2025
E-PAPER
Homeకవితకాళ్ళ పందిరి

కాళ్ళ పందిరి

- Advertisement -

స్వేఛ కోసం నేను
నా కోసం నా పక్కన మరో ఇద్దరు
గొంతెత్తి అరుస్తునే వున్నాము
హక్కుల కోసం ప్రాంతీయత, భాష, నీరు
అక్కడ అన్నీ సమస్యలే….
వరాలిచ్చేవాడెవడో తెలియదు
కాని ఎవరి తాపత్రయం వారిది
అప్పటి దాక అన్నీ మనవే అనుకుంటే
ఇప్పుడు గాలి కూడా సమస్యే
నిశబ్ధంగా వున్న చోట
మరో పెనుదుమారం ఆవహించి
కాళ్ళ పందిరి నీడలా కమ్ముకుంది
ఇప్పుడు యుద్ధం చేయడాని ఎవరస్తారు?
ప్రశ్నించాలంటే ఎండిపోయిన
గొంతు కొంతన్నా తడవాలి కదా
గోదావరిని చిన్న సీసాలో ఏ కంపెనీ వాడు
బంధించాడో గాని
ఓ మాతమూర్తి చేతిలో నుండి
మా కంఠాలను చేరి చల్లబరిచింది
ఇంతలో రైళు ఇక చాలు దిగండి అంటూ
కూ…అని ఓ హెచ్చరిక జారి చేసింది
మా పిడికిళ్ళు మాత్రం
ఇంకా బిగిసికొనే వున్నాయి
అడుగులు మెల్లగా
మరోవైపు పయనమయ్యాయి

– వజ్జీరు ప్రదీప్‌, 9989562991

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -