Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఓటు వేయలేదని రోడ్డు దిగ్బంధం

ఓటు వేయలేదని రోడ్డు దిగ్బంధం

- Advertisement -

పోలీసులపై ఓడిపోయిన అభ్యర్థి కుటుంబీకులు దాడికి యత్నం
కానిస్టేబుల్‌కు గాయాలు


నవతెలంగాణ-నేరడిగొండ
ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి ఎడ్లబండి అడ్డుపెట్టి రోడ్డును దిగ్బంధించాడు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి.. గ్రామస్తులు తనకు ఓటు వేయలేదన్న కోపంతో శనివారం గ్రామ ప్రధాన రహదారిపై ఎడ్ల బండిని అడ్డంగా పెట్టి రాకపోకలను నిలిపేశాడు. దీంతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలో గ్రామస్తులకు, సదరు వ్యక్తికి వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఇమ్రాన్‌ఖాన్‌ పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై అడ్డుగా ఉన్న ఎడ్ల బండిని తొలగించాలని సదరు వ్యక్తికి సూచించినా వినలేదు. ఇదే సమయంలో పోలీసులకు, ఓడిపోయిన అభ్యర్థి కుటుంబీకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో గస్తీ పెంచిన పోలీసులు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -