Sunday, December 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకిషన్ రెడ్డిపై ఫైర్ అయిన ఎంపీ చామల

కిషన్ రెడ్డిపై ఫైర్ అయిన ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటుంటే, కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఎందుకు స్పందించలేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు, రేవంత్ రెడ్డి తెచ్చిన విజన్ డాక్యుమెంట్ పై సోనియాగాంధీని ప్రశ్నిస్తూ ఓపెన్ లెటర్ రాయడం, ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసమే అని విమర్శించారు.

గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలను అందరిని పిలిచి ఎన్నికల్లో బీజేపీ వెనుకబడి పోవడానికి కారణం మీరేనంటూ చివాట్లు పెట్టిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐటి సిబిఐ, ఈడీల ద్వారా కల్వ కుంట్ల కుటుంబం చేసిన అవినీతిని ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ మీద పట్టింపు ఉంటే అప్పుల కుప్పగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మారుస్తున్నా.. రెండు పార్టీలు కుమ్మక్కై పట్టించుకోలేదన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. మెట్రో పేస్ టు మూసి పునర్జీవం త్రిబుల్ ఆర్ ఏమైందో తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నారు. చౌక బారు రాజకీయాలు మాని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టే ప్రయత్నం కిషన్ రెడ్డి చేయాలని హితువు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -