నవతెలంగాణ – ఆలేరు
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ తనకు తానే ఫుట్బాల్ ప్లేయర్ మెస్సిల భ్రమించుకొని రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ ఆట సవాలు చేయడం పట్ల భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ని రాజకీయాల ద్వారా ఫుట్ బాల్ ఆడు కుంటున్న విషయం తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారని, కేటీఆర్ ఐరన్ లెగ్ అని, మీ చెల్లి బావ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారని, హేళన చేశారు. నీ పుణ్యాన కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావలసి వచ్చింది.
రాజకీయాల్లో క్రియాశీలంగా లేకుండా చేశావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీది నత్తనడక, ప్రజల కంటికి కనిపిస్తూనే ఉన్నాయన్నారు. ఆడాల్సిన రాజకీయం ఆటలో నెగ్గలేక ఉన్న మీరు, ఫుట్బాల్ ఏమి ఆడతారని ప్రశ్నించారు. ఐరన్ లెగ్ కేటీఆర్ కు వరుస ఓటమిలతో మతిభ్రమించిందన్నారు. నువ్వు. మీ బావ ప్రెస్ మీట్ లు పెట్టినా.. ప్రజలు పట్టించుకోవడం మానేశారని హేళన చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమ్మెతో కే టీ ఆర్ లో ఫ్రస్టేషన్ పెరిగింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఆరు గ్యారంటీలు ఇచ్చిందని, భవిష్యత్తులో ఇంకా ఇస్తామని, అందుకోసం 50 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశామని చెప్పారు.
మీ నాన్న కేసిఆర్ బిజెపి నాయకులతో కలిసి రూ.8 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పులు మిగిల్చారని విమర్శించారు. రాష్ట్రం నుండి పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్న ప్రతి పైసా వెనక్కి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో బి ఆర్ ఎస్ మనుగడ టీఆర్ఎస్ నుండి బి ఆర్ ఎస్ గా మారగానే ఆ పార్టీకి తెలంగాణతో సంబంధం తెగిపోయింది అన్నారు. సొల్లు వాగుడు మాని ప్రాక్టికల్ గా ఆలోచించాలని హితువు పలికారు.



