– జిల్లా క్రీడల్లో రెండో స్థానం కైవసం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని పీఎం శ్రీ కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటారు. జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా మైదానంలో డీవో అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల కబడ్డీ క్రీడా పోటీల్లో సుమారు 40 పాఠశాలలు పాల్గొన్నాయి.ఈ పోటీల్లో కోన సముందర్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు కబడ్డీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానం కైవసం చేసుకున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు. విద్యార్థినుల ఈ విజయంపై ప్రధానోపాధ్యాయులు మధుపాల్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి కబడ్డీ క్రీడల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినిలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిఇబి సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీల్లో కోన సముందర్ విద్యార్థినుల ప్రతిభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



