Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీలో కోఆప్షన్ మెంబర్లుగా దివ్యాంగులకు అవకాశం కల్పించాలి 

జీపీలో కోఆప్షన్ మెంబర్లుగా దివ్యాంగులకు అవకాశం కల్పించాలి 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను 
కొత్తగా కొలువుదీరనున్న గ్రామపంచాయతీలలో కో ఆప్షన్ మెంబర్లుగా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని, వికలాంగుల హక్కుల నాయకులు బండ జహంగీర్ అన్నారు. ఆలేర్ పట్టణంలో ఆదివారం పాలసీతలీ కరణ  కేంద్రం వద్ద, ఏర్పాటుచేసిన సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. గ్రామపంచాయతీలో 5 శాతం రిజర్వేషన్ పాటిస్తూ , ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.. కో ఆప్షన్ నెంబర్లుగా ఒక వికలాంగులను నియమించాలని కోరారు.

ప్రజా పాలనలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వికలాంగులకు ప్రజలకు చేరవేసేందుకు కో ఆప్షన్ మెంబర్లు వారధిగా పనిచేస్తారని వివరించారు. చతిస్గడ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వికలాంగులను కో ఆప్షన్ నెంబర్లుగా నియమించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా ప్రజా పాలనలో వికలాంగులకు అవకాశాలు కల్పిస్తే, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేసి  ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు విజయకుమార్ ,లక్ష్మణ్, ఆరే ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -