పి వై ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ఇరుగు అనిల్
నవతెలంగాణ – నెల్లికుదురు
గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి అని పి వై ఎల్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఇరుగనిల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆదివారం మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకానికి ఉన్న మహాత్మ గాంధీ పేరును తొలగించి మార్పులతో కూడిన కొత్త బిల్లును తీసుకురావటం పథకాన్ని నిర్విరియం చేసే కుట్రలో భాగమే అని ఆరోపించారు. ఉపాధి హామీ పని దినాలను 200 రెండు వందల రోజులకు పెంచాలని ఉపాధి హామీ పథకాన్ని రైతాంగానికి అనుసంధానం చేయాలని, ఉపాధి కూలీలకు రోజువారి వేతనం 700 రూపాయలు కు పెంచాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మానస మహేశ్వరి అనూష తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం పేరు మార్పును విరమించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



